Page Loader
వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు
వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

వ్రాసిన వారు Stalin
Jul 05, 2023
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:45 గంటల ప్రాంతంలో వెస్ట్ వింగ్‌లోని ఓ ప్రదేశంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఈ పౌడర్‌ని గుర్తించారు. దీంతో కొద్దిసేపు కాంప్లెక్స్‌ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో లేరు. ఆయన వారాంతంలో క్యాంప్ డేవిడ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తెల్ల పౌడర్‌ను శ్వేత సౌధం అధికారులు పరీక్షల కోసం పంపారు. ప్రాథమిక పరీక్షల్లో ఆ పౌడర్ కొకైన్ అని తేలింది.

అమెరికా

కొకైన్ పౌడర్ వైట్‌హౌస్‌లోకి ఎలా వచ్చింది? అధికారుల విచారణ 

శ్వేత సౌధంలో లభించిన తెల్లటి పదార్థం కొకైన్ అని తేలగానే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వైట్ హౌస్‍‌ను తిరిగి తెరిచారు. అయితే ఆ పౌడర్‌ను సూక్ష్మ పరిశీలన కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆ రిపోర్టులు వచ్చాక పూర్తిసమాచారం అందిస్తామని అధికారులు చెప్పారు. అయితే పౌడర్ వైట్ హౌస్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు నడుస్తోందని భద్రతా ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వైట్ హౌస్‌లో డ్రగ్స్ గుర్తించిన విషయాన్ని అమెరికా మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.