LOADING...
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!
అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!

Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఫొటోతో కూడిన స్మారక డాలర్‌ నాణేన్ని విడుదల చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, తాజాగా యూఎస్‌ ట్రెజరీ వాటిని ధృవీకరించింది. యూఎస్‌ ట్రెజరర్‌ బ్రాండన్‌ బీచ్‌ ప్రకారం, అమెరికా 250వ వార్షికోత్సవం, అధ్యక్షుడి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత షట్‌డౌన్‌ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంలో విడుదల కానున్న నాణే డిజైన్‌ను కూడా షేర్ చేశారు. ఒకవైపు ట్రంప్ ఫొటోతో పాటు 1776, 2026 సంవత్సరాల నంబర్లు ఉన్నాయి.

Details

ఈ నాణెం విడుదల యూఎస్‌ చట్టాలకు వ్యతిరేకం

మరోవైపు పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన పిడికిలి బిగించి ఉన్న ఫొటో, "ఫైట్‌, ఫైట్‌" అనే వచనం కూడా ఉంది. అయితే ఈ నాణెం విడుదల యూఎస్‌ చట్టాలకు వ్యతిరేకమని సమాచారం. ఫెడరల్‌ చట్టాల ప్రకారం, అమెరికా అధ్యక్షులు లేదా మాజీ అధ్యక్షుల ఫొటోలు నాణేలపై ఉండకూడదు. మాజీ అధ్యక్షులు మరణిస్తే, 2 ఏళ్ల తర్వాత మాత్రమే వారి చిత్రాలను నాణేలపై వాడేలా ఉంది. అయితే, 250వ వార్షికోత్సవాన్ని దృష్టిలో ఉంచి, ట్రెజరీ శాఖకు కాంగ్రెస్‌ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ, ట్రంప్ ఈ డ్రాఫ్ట్‌ నాణెం చూశారో లేదో తెలియదని, అయితే ఈ డిజైన్ అధ్యక్షుడికి ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు.