న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.
అల్బుకెర్కీకి వాయువ్యంగా 180 మైళ్ల (290 కిలోమీటర్లు) దూరంలో న్యూ మెక్సికోలోని ఫార్మింగ్టన్ నివాస ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. కాల్పులు జరిపిన 18ఏళ్ల సాయుధుడిని కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సాయుధుడు ఎందుకు కాల్పులు జరిపాడనేది తెలియరాలేదని వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తుపాకీ కాల్పుల్లో ఏడుగురికి గాయాలు
Three people were killed and two police officers were among at least seven people injured when an 18-year-old opened fire in New Mexico before law enforcement fatally shot the suspect, authorities said. https://t.co/Iw6Mk3i4gW
— The Associated Press (@AP) May 16, 2023