
Flight: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. వెగాస్‌కు తిరిగి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగిన భయానక ఘటన అమెరికాలోని లాస్‌వేగాస్ నగరంలో చోటుచేసుకుంది. లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) విమానానికి గాల్లోనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇది టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే జరగగా, పైలట్లు అప్రమత్తంగా స్పందించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అమెరికా సమయానుసారం బుధవారం ఉదయం 8:11 గంటలకు లాస్‌వేగాస్ విమానాశ్రయం నుంచి ఆ విమానం నార్త్ కరోలినాలోని ఛార్లట్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం ఇంజిన్ నుంచి పొగలు,మంటలు రావడం ప్రారంభమయ్యాయి.
వివరాలు
విమానంలో మొత్తం 153 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది
ఈ పరిణామాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే తగిన చర్యలు తీసుకొని విమానాన్ని మళ్లించారు. ఉదయం 8:20 గంటలకు విమానం మళ్లీ లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 153 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని సంబంధిత అధికారులు తెలిపారు. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఇంజిన్ నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇంకా విమానాన్ని ల్యాండ్ చేసిన అనంతరం మెకానిక్స్ చేసిన పరిశీలనలో ఇంజిన్ నుంచి మంటలు వచ్చిన ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఎయిర్‌లైన్ సాంకేతిక నిపుణులు వెల్లడించడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు
#BreakingNews :-
— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) June 26, 2025
American Airlines Flight 1665 had to return to Las Vegas after its engine caught fire. This flight was going from Las Vegas in USA to North Carolina but it had to return within 10 minutes. There were 153 passengers on board this plane. It is being told that the… pic.twitter.com/EU9IQFdX4q