Page Loader
అమెరికాలో సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం.. ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు మాయం
ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు మాయం

అమెరికాలో సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం.. ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు మాయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 16, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్‌పోర్ట్ సిబ్బంది దొంగతనం చేసిన సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో సంచలం రేపుతోంది. ప్రయాణికుల లగేజీ బ్యాగ్‌ల నుంచి నగదును దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్న అంశం కలకలం సృష్టిస్తోంది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణీకుల డబ్బు, ఇతర వస్తువులను తస్కరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత జూన్ 29న ప్రయాణీకుల సామాను నుంచి దాదాపుగా 600 డాలర్ల నగదు, ఇతర వస్తువులను దొంగిలించారు. నిందితులను జోస్యు గొంజాలెజ్ (20), లాబారియస్ విలియమ్స్‌(33)గా గుర్తించారు. చెక్‌పాయింట్‌లో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి జులైలో నిందితులను అరెస్ట్ చేశారు. రోజుకు సగటున 1000 డాలర్లను దొంగిలించినట్లు అంగీకరించారు. దీంతో అధికారులు విధుల నుంచి ఇద్దరినీ తొలగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం