Loading...
America: అమెరికాలో టాయిలెట్ పేపర్, అత్యవసర వస్తువుల కొనుగోళ్లకు భారీ డిమాండ్.. ఎందుకంటే?
అమెరికాలో టాయిలెట్ పేపర్, అత్యవసర వస్తువుల కొనుగోళ్లకు భారీ డిమాండ్.. ఎందుకంటే?

America: అమెరికాలో టాయిలెట్ పేపర్, అత్యవసర వస్తువుల కొనుగోళ్లకు భారీ డిమాండ్.. ఎందుకంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ప్రజలు టాయిలెట్ పేపర్, జనరేటర్లు, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న సాంకేతిక అంతరాయాలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి. విమాన రాకపోకలు, బ్యాంకింగ్ సేవలు, కీలక ప్రభుత్వ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే వస్తువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో ఈ వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికాలో రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే డిస్కౌంట్లకు సిద్ధమవుతున్నప్పటికీ అత్యవసర వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు.

వివరాలు 

ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్, జనరేటర్లకు పెరిగిన డిమాండ్

బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ ఆన్‌లైన్ ధరల విశ్లేషణ ప్రకారం.. సెప్టెంబర్ నుంచి ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ ధరలు 12 శాతం పెరిగాయి.

గత ఏడాది ఇదే సమయంలో వీటి ధరలు 9 శాతం తగ్గడం గమనార్హం.

ప్రస్తుతం పరిశీలించిన ఆన్‌లైన్ ఉత్పత్తుల్లో మూడో వంతుకు పైగా స్టాక్ అందుబాటులో లేదు.

గత ఏడాది ఇదే సమయంలో ప్రతి 16 ఉత్పత్తుల్లో ఒకటి మాత్రమే స్టాక్ లేకుండా ఉండేది. జనరేటర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం పరిశీలించిన ఉత్పత్తుల్లో ఐదింట ఒక వంతుకు పైగా అందుబాటులో లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.

వివరాలు 

డిస్కౌంట్ల సీజన్‌లోనూ పెరుగుతున్న అత్యవసర వస్తువుల ధరలు

టాయిలెట్ పేపర్ ధరలు కూడా సెప్టెంబర్ నుంచి 4 శాతం పెరిగాయి.

గత ఏడాది ఇదే సమయంలో ధరలు తగ్గగా.. ఈసారి మాత్రం పెరుగుదల నమోదైంది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరిశీలించిన టాయిలెట్ పేపర్ ఉత్పత్తుల్లో దాదాపు 10 శాతం స్టాక్ అందుబాటులో లేదని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.

సాధారణంగా బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సందర్భంగా రిటైల్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.

దీంతో ఈ సమయంలో అత్యవసర వస్తువుల ధరలు తగ్గాలి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ధరలు పెరుగుతున్నాయి.

దుస్తులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా దాదాపు 1,400 ఇతర ఉత్పత్తుల ధరలు ఇదే సమయంలో సగటున 1 శాతం తగ్గినట్లు విశ్లేషణలో తేలింది.

ADVERTISEMENT

వివరాలు 

సాంకేతిక అంతరాయాలతో ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన

పేపర్ టవల్స్,బ్యాటరీలు,చెత్త సంచుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

వీటిలో చాలా ఉత్పత్తులు గత ఏడాదితో పోలిస్తే వేగంగా అమ్ముడవుతున్నాయి.

అత్యవసర వస్తువులకు పెరుగుతున్న డిమాండ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ పేర్కొంది.

అయితే ముడి పదార్థాలపై సుంకాలు,ఇంధన ధరలు,ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్న ఇతర అంశాలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చని తెలిపింది.

ఇటీవల అమెరికాలో విమాన రాకపోకలు,బ్యాంకింగ్ సేవలు,నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి కీలక వ్యవస్థల్లో సాంకేతిక అంతరాయాలు చోటుచేసుకున్నాయి.

దీనికి తోడు కృత్రిమ మేధ(ఏఐ)వల్ల కంప్యూటర్ వ్యవస్థల భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలు కూడా ప్రజల్లో పెరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర సేవలు నిలిచిపోతే ఏం చేయాలనే భయంతో ముందుగానే సరుకులు నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

90 రోజుల విద్యుత్ కోతల ప్రచారంతో పెరిగిన కొనుగోళ్లు

అమెరికాలోని ప్రముఖ రిటైల్ సంస్థలు వాల్‌మార్ట్, కాస్ట్‌కో కూడా అత్యవసర వస్తువుల కొనుగోళ్లు పెరిగినట్లు వెల్లడించాయి.

ప్రొపేన్ గ్యాస్, బాటిళ్లలో తాగునీరు, క్యాంపింగ్ పరికరాలు, బియ్యం, క్యాన్లలో నిల్వ చేసే ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగింది.

వాల్‌మార్ట్, కాస్ట్‌కోతో పాటు ట్రాక్టర్ సప్లై సంస్థల్లోనూ జనరేటర్లు, నీరు, ప్రొపేన్ వంటి వస్తువుల అమ్మకాలు పెరిగాయి.

దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చని, 90 రోజుల పాటు కరెంటు ఉండకపోవచ్చని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు కూడా ఈ కొనుగోళ్లకు కొంతవరకు కారణమవుతున్నాయి.

అయితే అమెరికాలో 90 రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందనే వాదనకు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు.

అయినప్పటికీ ఇలాంటి ప్రచారాలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి.

వివరాలు 

అత్యవసర పరిస్థితులకు సిద్ధమవుతున్న ప్రజలు

ఈ పరిస్థితి ఆన్‌లైన్‌లోనూ కనిపిస్తోంది. క్యాజువల్ ప్రిపర్స్ అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమానికి సహ నిర్వాహకుడైన కోబీ కూన్‌రాడ్ట్ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. తమ పదేళ్ల నాటి పాడ్‌కాస్ట్ డౌన్‌లోడ్లు నవంబర్ 19తో ముగిసిన 30 రోజుల కాలంలో 33 శాతం పెరిగినట్లు తెలిపారు.

ప్రజల్లో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలనే ఆసక్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

అయితే సమాజం పూర్తిగా కుప్పకూలిపోతుందనే భయంతో వస్తువులు కొనుగోలు చేయడం కంటే.. ఉద్యోగం కోల్పోవడం, అనుకోకుండా వైద్య ఖర్చులు రావడం వంటి సాధారణ ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకుని సిద్ధంగా ఉండాలని కూన్‌రాడ్ట్ సూచించారు.

ఇంట్లో తాగునీరు, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలు వంటి కనీస అవసరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

వివరాలు 

ధరల పెరుగుదలపై కొనసాగుతున్న ఆందోళన

మరోవైపు అమెరికాలో వినియోగదారుల విశ్వాసం మాత్రం మెరుగుపడింది.

కాన్ఫరెన్స్ బోర్డు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో 91.9గా ఉన్న వినియోగదారుల విశ్వాస సూచీ నవంబర్‌లో 103.3కు చేరింది.

ఇది జనవరి 2025 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి.

ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగడం దీనికి కారణమని రాయిటర్స్ వెల్లడించింది.

అయితే నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం అధికంగా ఉండటంపై అమెరికన్లు ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT