LOADING...
Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక
ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక

Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల్లో సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులకు ఏదైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ సమీప ప్రాంతాల్లో మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక టెహ్రాన్‌కు సమీపంలోకి చేరినట్లు సమాచారం. దీంతో ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి జరగవచ్చన్న ప్రచారం ఊపందుకుంది.

Details

ఖమేనీకి గట్టి వార్నింగ్

ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా అమెరికాకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే అది మధ్యప్రాచ్యమంతా వ్యాపించే ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. అమెరికా నావికాదళం మోహరింపు, ఈయూ మిలిటరీలను ఉగ్రవాద గ్రూపులుగా అభివర్ణించిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము ప్రేరేపకులు కాదు. ఏ దేశంపైనా దాడి చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఇరాన్‌పై దాడి చేసినా, వేధించినా వారికి గట్టి ప్రతిచర్య తప్పదని ఆయన స్పష్టం చేశారు. అయితే వాస్తవంగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.

Details

అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు

మరోవైపు అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని ఇరాన్ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకునే తదుపరి నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, ఆదివారం, సోమవారాల్లో ఇరాన్ వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో లైవ్-ఫైర్ సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. పర్షియన్ గల్ఫ్‌లోని ఈ కీలక జలమార్గం ద్వారా ప్రపంచ చమురు వ్యాపారంలో దాదాపు ఐదవ వంతు రవాణా జరుగుతుంది. ఈ డ్రిల్ సందర్భంగా అమెరికన్ యుద్ధ నౌకలు లేదా విమానాలను బెదిరించవద్దని, వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌ను హెచ్చరించింది.

Advertisement