Pakistan: పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం శుక్రవారం నాడు పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం, శుక్రవారం ఉదయం 09:13 సమయంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని ARY న్యూస్ నివేదించింది. పాకిస్థాన్ భూకంప కేంద్రం ప్రకారం, స్వాత్, మింగోరా, లోయర్ పీర్, అప్పర్ దిర్, పరిసర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగలేదు.