Loading...
USA: హెచ్‌1బీ వీసాలకు మళ్లీ షాక్‌..? మూడేళ్ల నిషేధానికి అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు
హెచ్‌1బీ వీసాలకు మళ్లీ షాక్‌..? మూడేళ్ల నిషేధానికి అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు

USA: హెచ్‌1బీ వీసాలకు మళ్లీ షాక్‌..? మూడేళ్ల నిషేధానికి అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హెచ్‌-1బీ వీసా విధానంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. హెచ్‌1బీ వీసాల జారీని మూడేళ్లపాటు నిలిపివేయడంతో పాటు, ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజును చట్టబద్ధం చేయాలని కోరుతూ అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. పాలక రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ టిమ్‌ షీహీ ఈ బిల్లును ప్రతిపాదించారు. సెనేట్‌లో 'హెచ్‌-1బీ వీసా దుర్వినియోగ నిరోధక చట్టం' సెనేటర్‌ టిమ్‌ షీహీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 'హెచ్‌-1బీ వీసా దుర్వినియోగ నిరోధక చట్టం'(H-1B Visa Abuse Prevention Act) అనే పేరు పెట్టారు. ఈ బిల్లు ప్రకారం హెచ్‌1బీ వీసాల జారీని మూడేళ్లపాటు నిలిపివేయాలని, అలాగే ట్రంప్‌ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల ఫీజును చట్టబద్ధం చేయాలని ప్రతిపాదించారు.

వివరాలు 

'అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలి'

ఈ సందర్భంగా సెనేటర్‌ టిమ్‌ షీహీ విడుదల చేసిన ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.

"స్థానికులతో భర్తీ చేయలేని ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల కోసం మాత్రమే హెచ్‌1బీ కార్యక్రమాన్ని రూపొందించారు.

కష్టపడి పనిచేసే అర్హులైన అమెరికన్లను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించడానికి ఈ వీసా వ్యవస్థను ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు.

లాటరీ విధానానికి బదులుగా ప్రతిభకు ప్రాధాన్యం

ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానానికి బదులుగా, అధిక వేతనాలు పొందే అత్యుత్తమ ప్రతిభావంతులకే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలని టిమ్‌ షీహీ ప్రతిపాదించిన బిల్లులో పేర్కొన్నారు.

నైపుణ్యం, వేతన స్థాయి ఆధారంగా వీసాల కేటాయింపు జరగాలని అందులో సూచించారు.

వివరాలు 

చట్టంగా మారాలంటే ఉభయ సభల ఆమోదం తప్పనిసరి

సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెంటనే అమల్లోకి రాదు. అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలు (సెనేట్‌, ప్రతినిధుల సభ) దీనిని ఆమోదించిన తర్వాతే ఇది చట్టంగా అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

లక్ష డాలర్ల ఫీజుపై కోర్టుల్లో వివాదం

హెచ్‌1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా దిగువ కోర్టు ఇప్పటికే కొట్టివేసింది.

అనంతరం ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్‌ ఆమోదం లేకపోవడంతో చట్టవిరుద్ధమన్న కోర్టు

హెచ్‌1బీ వీసా ఫీజు పెంపునకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లేదని, అందువల్ల అది చట్టవిరుద్ధమైన పన్నుగా పరిగణించాలని జిల్లా జడ్జి లియో సోరోకిన్‌ జూన్‌ 8న తీర్పు ఇచ్చారు.

ఆ తీర్పును సవాలు చేస్తూ ఫెడరల్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ, దానికి కూడా కోర్టు నిరాకరించింది.

ADVERTISEMENT