Loading...
Strait of Hormuz Attack: హర్ముజ్ జలసంధిలో మరో భారతీయుల నౌకపై దాడి.. 29 మంది సురక్షితం!
హర్ముజ్ జలసంధిలో మరో భారతీయుల నౌకపై దాడి.. 29 మంది సురక్షితం!

Strait of Hormuz Attack: హర్ముజ్ జలసంధిలో మరో భారతీయుల నౌకపై దాడి.. 29 మంది సురక్షితం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సముద్ర మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న నౌకలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్న నౌకలపై దాడులు జరగడంపై ఇటీవల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

వివరాలు

ఏం జరిగింది?

అక్టోబర్ 30న పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ ఎంటీ లూయిస్ 1 (MT LOUISE 1)పై లింపెట్ మైన్లతో దాడి జరిగింది.

ఈ నౌకలో మొత్తం 27 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారు. దాడి కారణంగా నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి.

దీంతో ట్యాంకర్ కొంతసేపు నిలిచిపోయింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

నౌకలో ఉన్న 27 మంది భారతీయులు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అనంతరం ట్యాంకర్ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది.

వివరాలు

మరో నౌకపైనా దాడి

అక్టోబర్ 29న కూడా హర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి జరిగినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న భారీ చమురు రవాణా నౌక ఎంటీ అర్జానా (MT ARZANAH)పై ప్రక్షేపకంతో దాడి జరిగినట్లు తెలిపారు.

ఈ నౌకలో ఇద్దరు భారతీయ నావికులు ఉన్నారు.

ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 29 మంది భారతీయులు ఉండగా, వారందరూ సురక్షితంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

హర్ముజ్ జలసంధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై వరుస దాడులు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

నౌకల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా నౌకల నిర్వహణ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సర్బానంద సోనోవాల్ తెలిపారు.

ఈ వివరాలను ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకల భద్రత మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT