Araghchi: పెంపుడు శక్తులను అదుపులో పెట్టండి.. అమెరికాను హెచ్చరించిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు ఇరాన్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న శక్తులను నియంత్రించాలని, లేకపోతే తగిన రీతిలో సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఇరాన్‌పై లేదా తమ దేశ అత్యున్నత నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే గట్టి ప్రతిస్పందన తప్పదని ఆయన హెచ్చరించారు.
వివరాలు
శాంతి పునరుద్ధరణ కోసం కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం
ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణశిక్షకు అర్హుడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ చేసిన వ్యాఖ్యలపై అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించి ఇజ్రాయెల్‌ను అదుపులో పెట్టకపోతే, ఇజ్రాయెల్‌కు ఇరానే తగిన సమాధానం ఇస్తుందని అరాగ్చీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.