6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్.. బైడెన్‌తో కీలక భేటీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్ అమెరికాకు రావడం ఆసక్తికరమైన పరిణామం అని చెప్పుకోవాలి. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్(APEC) సమ్మిట్‌లో జిన్‌పింగ్ పాల్గొనున్నారు. ఈ సమ్మిట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ జిన్‌పింగ్ భేటీ కానున్నారు. దాదాపు 4గంటల పాటు ఇరువురు నేతల మధ్య సమావేశం ఉంటుందని, ఇందులో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంపై దృష్టి సారించనున్నట్లు వాయిస్ ఆఫ్ అమెరికా తెలిపింది
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చించే అవకాశం
బైడెన్- జిన్‌పింగ్ మధ్య ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోని రెండు ఆర్థిక అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఇలాంటి చర్చలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు, తైవాన్, ఇండో-పసిఫిక్, మానవ హక్కులు, ఫెంటానిల్ ఉత్పత్తి, AI అలాగే వాణిజ్య, ఆర్థిక సంబంధాల వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జిన్‌పింగ్ అమెరికా పర్యటనపై బైడెన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు. సంక్షోభ సమయాల్లో ఇరు దేశాలు పరస్పరం మాట్లాడుకోవాలని, ఇరు దేశాల సైన్యం సంప్రదింపులు జరపాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.