DR Congo: కాంగోలో ఘోర విషాదం.. స్కూల్‌లో మంటలు..ఆపై తొక్కిసలాటతో 29 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పాఠశాలలను చుట్టుముట్టడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 24 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుకావు నగరంలో జరిగింది. మూడు వందల చెక్క ఇళ్లూ దగ్ధం బుకావులోని చింపుండా ప్రాంతంలో గురువారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత ఒక ప్రాంతంలో ప్రారంభమైన మంటలు క్రమంగా సమీపంలోని ఉజామా ప్రైమరీ స్కూల్, ఫురాహా సెకండరీ స్కూల్‌కు వ్యాపించాయి. పాఠశాలలతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 300 చెక్క ఇళ్లు కూడా మంటలకు ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
మంటలు వ్యాపించడంతో తొక్కిసలాట
ప్రస్తుతం బుకావు రీజియన్ మొత్తం తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉండటం గమనార్హం.
మంటలు వేగంగా విస్తరించడంతో విద్యార్థులు ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ సమయంలో భారీగా తొక్కిసలాట జరిగింది.బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు విద్యార్థులు ఒకరినొకరు తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చింది.
మరికొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ఈ తొక్కిసలాటలో కూడా పలువురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక క్లినిక్ నర్సు క్రిస్టోఫ్ జిగషానే వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు 50మంది విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులను తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రులకు తరలించారు.
వారిలో కొందరు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా..మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
వివరాలు
క్షతగాత్రులకు చికిత్స
ఈ ఘటనలో మరో 29మంది చికిత్స పొందుతున్నట్లు ఏఎఫ్‌సీ/ఎం23 (AFC/M23) తిరుగుబాటు ఉద్యమ ప్రతినిధి లారెన్స్ కన్యుకా తెలిపారు.
వీరిలో 21మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన వారిలో 17మందిని కడుటు జనరల్ ఆస్పత్రికి, మరో నలుగురిని బుకావు ప్రావిన్షియల్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.
తిరుగుబాటుదారుల ఆధీనంలో బుకావు
బుకావు నగరం 2025 ఫిబ్రవరి నుంచి రువాండా మద్దతు ఉన్న AFC/M23 తిరుగుబాటు సంస్థ నియంత్రణలో ఉంది.
ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ క్రమంగా తన ఆధిపత్యాన్ని విస్తరిస్తూ వచ్చింది.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఇంతటి భారీ అగ్నిప్రమాదం సంభవించడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం
#RDC – #Bukavu : 15 élèves morts dans un incendie à Kasheke
— Steve Wembi (@wembi_steve) September 10, 2026
Le bilan provisoire des incendies survenus ce jeudi à Kasheke, à Bukavu, fait état de 15 élèves morts et de plusieurs blessés graves, selon les autorités locales.
Les victimes sont des élèves des écoles Ujamaa et… pic.twitter.com/HCT2xcL0mL