Obama: ఏలియన్స్‌పై బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రహాంతరవాసుల ఉనికి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఏలియన్స్, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలోని Area 51తో గ్రహాంతరవాసులకు సంబంధం ఉందన్న ప్రచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక గ్రహంపై జీవరాశులు ఉండే అవకాశాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అయితే ఏలియన్స్‌ను ఏరియా 51లో అమెరికా ప్రభుత్వం నిర్బంధించి ఉంచిందన్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆరోపణలకు ఆధారాలు కూడా లేవని తెలిపారు.
Details
ఎలాంటి సమాచారం లేదు
దశాబ్దం క్రితం అమెరికా వైమానిక దళం రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ వస్తువులు కనిపించాయని వచ్చిన నివేదికలపై కూడా ఒబామా స్పందించారు. తాను అధికారంలో ఉన్న సమయంలో గ్రహాంతరవాసుల ఉనికిని నిర్ధారించే విధంగా ప్రభుత్వ వద్ద ఎలాంటి ధృవీకృత సమాచారం లేదని పేర్కొన్నారు.
Details
ఏరియా 51 అంటే ఏమిటి?
నెవాడ రాష్ట్రంలో ఉన్న ఏరియా 51 అమెరికాలో అత్యంత రహస్య స్థావరంగా పేరొందింది. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ స్థావరం 1955లో స్థాపించబడింది. నెవాడ ఎడారిలో సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉంది. ఇక్కడ గతంలో లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన యూ-2 నిఘా విమానాలను పరీక్షించారు. అనంతరం పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఇక్కడే అంచనా వేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయడంపై నిషేధం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ ఆంక్షలను సడలించారు.