
Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో హింసాకాండ కొనసాగుతోంది.
పారామిలటరీ సంస్థ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు తాజాగా పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డాయి. జామ్జామ్ శిబిరాల్లో నివసిస్తున్న పౌరులపై శుక్రవారం జరిపిన దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది 'రిలీఫ్ ఇంటర్నేషనల్' అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారు.
శనివారం అబూషాక్ శిబిరంపై కూడా RSF బలగాలు దాడులు కొనసాగించాయి.
ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో స్వచ్ఛంద సంస్థ సమాచారం ప్రకారం ఈ దాడుల్లో మొత్తం 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Details
ఇప్పటివరకు 29,600 మందికి పైగా పౌరులు మృతి
తీవ్రంగా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ దాడులపై RSF బలగాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సూడాన్‌లో కల్లోలానికి కారణమైన ఈ ఘర్షణలు 2023 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి.
ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్, మాజీ డిప్యూటీ, RSF కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాల కారణంగా ఈ రెండు బలగాల మధ్య తీవ్ర పోరాటం చెలరేగింది.
ఈ SAF (సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్) RSF మధ్య సుదీర్ఘ హింసాకాండలో ఇప్పటివరకు 29,600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Details
సుడాన్ ను వదిలి వెళ్లిపోయిన కోటిమంది ప్రజలు
అంతేకాకుండా, దాదాపు కోటి మంది ప్రజలు సూడాన్‌ను వదిలి ఇతర దేశాలకు పాలాయించారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సూక్ష్మంగా చూస్తే, సూడాన్‌లోని హింసాత్మక పరిస్థితులు రోజు రోజుకు మరింత విషమంగా మారుతున్నాయి.
పౌరులే కాకుండా సహాయ సంస్థల ఉద్యోగులు కూడా ఈ అల్లర్లకు బలైపోతుండడం ఆందోళన కలిగించే విషయంగా మారింది.