Philippines: ఫిలిప్పీన్స్‌లో పడవలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన పలవాన్‌కు వెళ్తున్న 'MV జూన్ ఆస్టర్' అనే పడవ బుధవారం రాత్రి సముద్రం మధ్యలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సమయంలో పడవలో మొత్తం 137 మంది ఉన్నారు. వారిలో 117 మంది ప్రయాణికులు కాగా.. 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదు. 42 మందిని సురక్షితంగా రక్షించినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
కోరాన్ సమీప సముద్ర జలాల్లో ఈ ప్రమాదం
పర్యాటక కేంద్రమైన కోరాన్ సమీప సముద్ర జలాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సముద్ర తీరానికి సుమారు 1.2 నాటికల్ మైళ్ల దూరంలో పడవలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11.02 గంటల సమయానికి 42 మందిని రక్షించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను కోరాన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
పడవలో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
137 మందితో వెళ్తున్న పడవలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
Five casualties were initially reported after passenger ship MV June Aster caught fire in waters off Coron, Palawan, on Wednesday (Sept. 9, 2026) night, the Philippine Coast Guard said.
— Philippine News Agency (@pnagovph) September 10, 2026
As of 11:10 p.m., PCG spokesperson Commodore Noemie Cayabyab said 42 people had been rescued,… pic.twitter.com/4g7pyW4AsM