Turkey Parliament: టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ.. వీడియో ఇదిగో!
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీ (తుర్కియే) పార్లమెంటు బుధవారం యుద్ధరంగంలా మారింది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకం చుట్టూ చెలరేగిన వివాదం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. సభలో ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు చేసుకుంటూ,తోపులాటకు దిగడంతో కొద్ది సేపు పార్లమెంటు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్‌లో మార్పులు చేపట్టి, వివాదాస్పద అధికారిగా పేరొందిన అకిన్ గుర్లెక్‌ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం సభలోని పోడియం వైపు వెళ్లగానే ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వివరాలు
5 నిమిషాల పాటు పార్లమెంట్ వాయిదా
దీనికి ప్రతిగా అధికార ఏకే పార్టీ సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై చివరకు శారీరక ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అధికార పార్టీ ఎంపీలు గుర్లెక్‌కు భద్రతగా నిలవడంతో ఆయన తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
వివరాలు
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టిన అధికారికి మంత్రి పదవిపై విమర్శలు
గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన అకిన్ గుర్లెక్, ప్రతిపక్ష నేతలపై రాజకీయ ఉద్దేశాలతో కేసులు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై 142 కేసులు నమోదు చేసి, ఆయనకు 2,000 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించాలన్న డిమాండ్ వెనుక గుర్లెక్ పాత్ర ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి న్యాయశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన దాడేనని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టర్కీ పార్లమెంటులో రణరంగం
JUST IN: 🇹🇷 Brawl breaks out in Turkey's parliament. pic.twitter.com/xHojcjLkez
— BRICS News (@BRICSinfo) February 11, 2026