Brazilian beauty queen: గుండెపోటుతో బ్రెజిల్ బ్యూటీ క్వీన్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌కు చెందిన యువ బ్యూటీ క్వీన్ మయ్యారా క్రిస్టినా డి లిమా ఫియేల్(31)గుండెపోటుతో ఆకస్మికంగా మరణించింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆమె ఇలా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు, స్నేహితులను షాక్‌కు గురిచేసింది. ఒక చిన్నారికి తల్లైన మయ్యారా వచ్చే వారం బ్యూటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా, ఈ విషాదం జరిగింది గుండెపోటు వచ్చిన తర్వాత గంటపాటు వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గతంలో ఆమె పలు బ్యూటీ కాంటెస్టుల్లో విజేతగా నిలిచి,గత ఏడాది మిస్ లొండ్రినా టైటిల్ గెలుచుకుంది. అలాగే 2025-26 మిస్ సరాండి పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఏప్రిల్ 29న జరగాల్సిన పోటీల నిర్వాహకుడు విటర్ టవారెస్ ఆమె మృతిపై భావోద్వేగ పోస్టు పెట్టాడు.
వివరాలు
సోషల్ మీడియాలో అభిమానుల నివాళులు
మయ్యారా చాలా కష్టపడే అమ్మాయి..తన లక్ష్యంపై ఫోకస్ పెట్టి ఈ కలను సాధించడానికి ఎంత సీరియస్‌గా పనిచేసిందో నేను స్వయంగా చూశాను"అని ఆయన తెలిపారు. పోటీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ఇంటర్వ్యూలు కూడా ముగించిందని తెలిపాడు. నిన్ననే ఆమెతో మాట్లాడానని,ఆమె మృతి వార్త నమ్మలేకపోయానని చెప్పాడు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఆమెకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గుండె సంబంధిత ఎలాంటి సమస్యలు లేకపోయినా, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఫుల్‌మినెంట్ మయోకార్డైటిస్ కారణంగా ఆమె మరణించి ఉండొచ్చని సమాచారం. ఈ వ్యాధి వల్ల ఒక్కసారిగా గుండె పనితీరు దెబ్బతిని ప్రాణాపాయం కలుగుతుంది. అలసట, ఛాతినొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.