USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. కుమార్తె ముందే కాల్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారి హత్యకు గురయ్యారు. టెన్నెసీలోని జాక్సన్‌లో దుకాణం నిర్వహిస్తున్న సురేష్ పటేల్ (62)ను దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు కాల్చిచంపాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సురేష్ పటేల్ తన 19 ఏళ్ల కుమార్తెతో కలిసి దుకాణంలో ఉన్న సమయంలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. తుపాకీ చూపించి నగదు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బు తీసుకున్న అనంతరం సురేష్‌పై పలు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ దారుణ ఘటనను ఆయన కుమార్తె కళ్లారా చూసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు
మృతుడు గుజరాత్ కు చెందినట్లు గుర్తింపు
మృతుడు గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన అమెరికాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంతేకాదు.. ఘటనకు కేవలం మూడు రోజుల ముందే సురేష్ పటేల్ ఆ దుకాణాన్ని కొత్తగా తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బూడిద రంగు హుడీ, జీన్స్, నల్లటి బూట్లు ధరించిన అతడు పెయింట్‌బాల్ తరహా మాస్క్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాల్పుల అనంతరం తెల్లటి కారులో పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టి, అతడు ఆయుధాలతో ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించారు.
వివరాలు
నిందితుడి కోసం గాలింపు చర్యలు