Donald Trump: 'సూర్యాస్తమయం నాటికి...': అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన విక్టరీ ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీని వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఏర్పాటు చేశారు, ఇందులో తన మద్దతుదారులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తన అధ్యక్షత్వం కాలంలో నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
"రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దాడి ఆగిపోతుంది. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. అమెరికన్ శక్తి, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో కొత్త రోజును ప్రారంభించనున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ వలసదారులను విదేశాలకు పంపిస్తా" అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా: ట్రంప్
మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా చర్యలు తీసుకుంటానని తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.
జాన్ ఎఫ్. కెనడీ, రాబర్ట్ ఎఫ్. కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసుల ఫైళ్లను బహిర్గతం చేస్తానని చెప్పారు.
ప్రభుత్వంలో పారదర్శకత కోసం రాబోయే రోజుల్లో పలు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.
మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలో, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న ఏవీ నిర్ణయాలు అమలులోకి రాకుండా చూస్తానని పేర్కొన్నారు.
వివరాలు
టిక్‌టాక్ వాటాపై ట్రంప్ కీలక ప్రకటన
టిక్‌టాక్ సంస్థకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
టిక్‌టాక్‌లో కనీసం 50శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దాని సేవలను పునరుద్ధరించనున్నట్లు చెప్పారు.
ఈ భరోసా మీద టిక్‌టాక్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
మెలానియా ట్రంప్‌కి సొంత క్రిప్టో కరెన్సీ..
ట్రంప్ హయాంలో క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యం ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈమేరకు,ట్రంప్ సతీమణి మెలానియా తన సొంత క్రిప్టో కరెన్సీ(మీమ్ కాయిన్)ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది ముందు కూడా ట్రంప్ సొంత మీమ్ కాయిన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఆ కాయిన్ విలువ భారీగా పెరగడం గమనార్హం.