Loading...
Canada Visa Processing: కెనడాది అదేపాటనా... భారతీయులంటే అక్కసెందుకో
కెనడాది అదేపాటనా... భారతీయులంటే అక్కసెందుకో

Canada Visa Processing: కెనడాది అదేపాటనా... భారతీయులంటే అక్కసెందుకో

వ్రాసిన వారు Balachander Sharma
Oct 22, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆశిస్తున్న భారతీయులకు వీసా నిరీక్షణ మరింత పెరిగింది. ముఖ్యంగా విద్యార్థుల స్టడీ పర్మిట్లు, తల్లిదండ్రుల సూపర్‌ వీసాల ప్రాసెసింగ్‌కు అదనపు సమయం పడుతోంది. అయితే, విజిటర్‌ వీసాల విషయంలో మాత్రం స్వల్పంగా ఉపశమనం లభించింది. కెనడా ఇమ్మిగ్రేషన్‌ శాఖ (ఐఆర్‌సీసీ) అక్టోబర్‌ 14న విడుదల చేసిన తాజా వివరాలు ఈ మార్పులను వెల్లడించాయి.

Details

స్టడీ పర్మిట్‌కు 7 వారాలు

భారత్‌ నుంచి కెనడా వెళ్లేందుకు స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రస్తుతం సుమారు 7 వారాలు వేచి చూడాల్సి వస్తోంది.

గత వారం ఈ సమయం 6 వారాలుగా ఉండేది. అంటే, దరఖాస్తుల పరిశీలనకు మరో వారం అదనంగా పడుతోంది.

భారత్‌ నుంచి వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ్‌ సమయం 11 వారాలుగా ఉంది.

కెనడాలో ఉండి వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 15 వారాలు పడుతోంది.

దీంతో చదువు, ఉద్యోగం లేదా ఇతర అవసరాల కోసం కెనడాకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Details

సూపర్‌ వీసాకు 77 రోజులు

కెనడాలో పౌరసత్వం లేదా శాశ్వత నివాస హోదా పొందినవారి తల్లిదండ్రులు, తాతముత్తాతలు ఎక్కువకాలం ఉండేందుకు ఉపయోగపడే సూపర్‌ వీసా ప్రాసెసింగ్‌ సమయం 74 రోజుల నుంచి 77 రోజులకు పెరిగింది.

మరోవైపు, భారతీయుల విజిటర్‌ వీసా నిరీక్షణ 30 రోజుల నుంచి 29 రోజులకు తగ్గింది. ఈ మార్పు స్వల్పమే అయినప్పటికీ, పర్యటన కోసం దరఖాస్తు చేసుకునేవారికి కొంత ఊరటనిస్తుంది.

ADVERTISEMENT

Details

పెండింగ్‌లో భారీ సంఖ్యలో దరఖాస్తులు

కెనడాలో ఇప్పటికే ఉంటూ తమ పర్మిట్లను పొడిగించుకోవాలనుకునేవారికి మాత్రం జాప్యం తీవ్రంగా ఉంది. విజిటర్‌ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 357 రోజులు పడుతోంది.

స్టడీ పర్మిట్‌ పొడిగింపులకు 8 వారాలు అవసరమవుతుండగా, 27,700 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వర్క్‌ పర్మిట్‌ పొడిగింపుల కోసం 13 వారాల నిరీక్షణ ఉండగా, పరిశీలనలో ఉన్న దరఖాస్తుల సంఖ్య 2,05,400గా ఉంది.

ఐఆర్‌సీసీ 2026 జనవరి నుంచి జూలై మధ్య 18,32,065 తాత్కాలిక నివాస దరఖాస్తులను పరిష్కరించింది. అయినప్పటికీ, జూలై 31 నాటికి 3,94,000కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ADVERTISEMENT

Details

ప్రాసెసింగ్‌ సమయంపై క్లారిటీ

దరఖాస్తుల సంఖ్య, పత్రాల పరిశీలన, కేసుల సంక్లిష్టత, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ప్రాసెసింగ్‌ సమయం మారుతుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ శాఖ స్పష్టం చేసింది.

అందువల్ల వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తాజా గడువులను పరిశీలించి, అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

ADVERTISEMENT