Donald Trump: త్వరలోనే ఇరాన్‌లో మార్పులు..? ట్రంప్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే యూఎస్ సైన్యం ఇరాన్‌ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టిన నేపథ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ దేశంలో పాలనా మార్పు (రెజీమ్ చేంజ్) అవసరమని, అదే అక్కడి పరిస్థితులను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
Details
కొత్త పాలకులను ఎంచుకొనే అధికారం ఇరాన్ కే ఉంటుంది
గత 47 ఏళ్లుగా చర్చల పేరుతో ఇరాన్ వ్యవహరిస్తోందని, ఈ కాలంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇకపై ఈ విషయంలో ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు. అయితే కొత్త పాలకులను ఎంచుకునే అధికారం ఇరాన్ ప్రజలకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.