Page Loader
China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం
China Eonomy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం

China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం

వ్రాసిన వారు Stalin
Aug 22, 2023
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ నివేదించింది. ఆ దేశం గత 40ఏళ్లుగా అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనా ప్రస్తుతం కాలంలో విఫలమైందని పేర్కొంది. జనాభా పెరుగుదల, ఆర్థిక సమస్యలతో చైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబుగా మారిందని ఇటీవల వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆ వ్యాఖ్యల అనంతరం వాల్‌స్ట్రీట్‌ ఈ నివేదికను వెల్లడించడం గమనార్హం.

చైనా

చైనాలోకి తగ్గిన పెట్టుబడులు

చైనా ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలోకి ప్రవేశించినట్లు వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ అంచనా వేసింది. ప్రతికూల జనాభా, ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన దేశాలతో చైనా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశం వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చైనాలోకి విదేశీ పెట్టుబడులు తగ్గినట్లు పేర్కొంది. అయితే చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుతం పడిన ప్రతికూల ప్రభావం దీర్ఘ కాలంగా ఉంటుందని స్పష్టం చేసింది. వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ కథనంపై చైనా స్పందించింది. కొవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ నూతన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ నాయకులు చెబుతున్నారు.