Page Loader
China: చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్‌ గ్రేట్‌వాల్‌ నిర్మాణం 
చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్‌ గ్రేట్‌వాల్‌ నిర్మాణం

China: చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్‌ గ్రేట్‌వాల్‌ నిర్మాణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఈసారి, వారు సోలార్‌ గ్రేట్‌వాల్‌ను నిర్మించే పనిలో పడారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో జరుగుతుంది. దీని ద్వారా సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు, తద్వారా బీజింగ్‌ విద్యుత్తు అవసరాలను తీర్చుకోగలదు. ప్రస్తుతం చైనా, 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్‌ ప్యానల్స్‌ను అమర్చినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ఇన్నర్‌ మంగోలియాలోని కబుకీ ఎడారిలో వేగంగా జరుగుతోంది. గతంలో ఈ ఎడారి ప్రాంతాన్ని సీ ఆప్‌ డెత్‌గా పిలిచేవారు, కానీ ఇప్పుడు ఈ ప్రాంతం మారిపోయింది.

వివరాలు 

సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మించారు

నాసా ఎర్త్‌ అబ్జర్వేటరీ ఈ మార్పును గుర్తించి, ''ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానల్స్‌ కారణంగా ఈ ప్రాంతం ఫొటోవాల్టిక్‌ సముద్రంగా మారింది'' అని పేర్కొంది. కబుకీ ఎడారిలో వేడి వాతావరణం, చుదునైన భూమి మరియు పారిశ్రామిక ప్రాంతాల సమీపం వంటి అంశాలు సోలార్‌ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయి. నాసాకు చెందిన ల్యాండ్‌ శాట్‌ 8, 9 ఉపగ్రహాలు ఈ ప్రాంతాన్ని పరిశీలించి, 2017 నుండి 2024 మధ్య జరిగిన మార్పులను స్పష్టంగా చిత్రీకరించాయి. జున్మా సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మించారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ప్యానల్స్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది.

వివరాలు 

4,00,000 మంది ప్రజల విద్యుత్తు అవసరాలను తీర్చగలదు

ఈ స్టేషన్ ఏటా 200 కోట్ల కిలోవాట్‌ పర్‌ అవర్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు, ఇది సుమారు 4,00,000 మంది ప్రజల విద్యుత్తు అవసరాలను తీర్చగలదు. ప్రస్తుతం చైనా సోలార్‌ విద్యుత్తు సంస్థలు మొత్తం 3,86,875 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు, ఇది ప్రపంచ మొత్తం సామర్థ్యం సగానికి సమానం. రెండో స్థానంలో ఉన్న అమెరికా 79,364 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు.