Loading...
Brahmaputra Dam Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు.. భూకంపాల ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక
బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు.. భూకంపాల ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక

Brahmaputra Dam Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు.. భూకంపాల ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్యాం వల్ల నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి టిబెట్‌తో పాటు భారత్‌, బంగ్లాదేశ్‌లకు వరదలు, కరవు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 16,800 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయితే దీని స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 60,000 మెగావాట్లకు మించనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టుగా పేరొందిన చైనాలోని త్రీ గోర్జెస్‌ డ్యాం సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

వివరాలు 

ఆకస్మిక వరదలు

ఈ ఏడాది ఆగస్టు 26న చైనా-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో మంచు,రాళ్లతో కూడిన హిమపాతం సంభవించడంతో దిగువ ప్రాంతాల్లో నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి.

ఈ ఘటనల కారణంగా నేపాల్‌,టిబెట్‌ ప్రాంతాల్లో దాదాపు 1,500మంది మరణించగా,5,500మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రతిపాదించిన భారీ డ్యాం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మొదలైంది.

చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌,యున్నాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహానికి సంబంధించిన గత చరిత్రను అధ్యయనం చేశారు.

ఇందుకోసం 1325 నుంచి 2020వరకు ఆగ్నేయ టిబెటన్‌ పీఠభూమిలో పెరిగిన చెట్ల వలయాల వెడల్పును పరిశీలించారు.

ఈ పరిశోధన ఆధారంగా నదిలో నీటి ప్రవాహంలో గతంలో చోటుచేసుకున్న మార్పులను అంచనా వేశారు.

వివరాలు 

జలచక్రంపై ప్రభావం

మరోవైపు, భూతాపం కారణంగా టిబెటన్‌ పీఠభూమి ప్రపంచ సగటు కంటే దాదాపు రెండింతల వేగంతో వేడెక్కుతోందని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.

దీంతో అక్కడి మంచు పొరలు వేగంగా కరిగిపోతున్నాయని, ఈ పరిణామం జలచక్రంపై ప్రభావం చూపుతోందని వివరించారు.

వాతావరణ మార్పులతో పాటు మంచు కరగడం వల్ల బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం అనూహ్యంగా పెరగడం లేదా తగ్గడం జరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఇలాంటి ఆకస్మిక మార్పులు దక్షిణాసియాలోని భారత్‌, బంగ్లాదేశ్‌లలో వరదలు, కరవు పరిస్థితులకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

భూగర్భ పగులు రేఖ

ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలకమైన ఆందోళన కూడా ఉంది.

ప్రతిపాదిత డ్యాం నిర్మాణ ప్రాంతానికి దిగువన చురుకైన భూగర్భ పగులు రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తే డ్యాం నిర్మాణం దెబ్బతినడంతో పాటు ప్రాజెక్టు స్థిరత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

భారీ వ్యయంతో చేపడుతున్న ఈ జల విద్యుత్‌ ప్రాజెక్టు వల్ల విద్యుత్‌ ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నప్పటికీ, ప్రకృతి వైపరీత్యాలు, నదీ ప్రవాహంలో మార్పుల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల హెచ్చరికలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT