NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా
    2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా

    China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో పోరాడుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం గణనీయమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    ఇది గత మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి సంతృప్తికర ఫలితాలను ఇవ్వడం లేదు.

    వరుసగా మూడో ఏడాది కూడా జనాభా తగ్గుదల నమోదవుతోంది. ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

    గతంలో "ఒకే సంతానం విధానం" అనుసరించడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా భావించవచ్చు. దీని వల్ల వృద్ధుల సంఖ్య పెరిగి, యువత జనాభా గణనీయంగా తగ్గిపోయింది.

    వివరాలు 

    2023లో జననాల రేటు తగ్గి 90.2 లక్షల మంది మాత్రమే

    తాజాగా చైనా జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024లో చైనా జనాభా 1.39 మిలియన్ మందికి తగ్గిపోయి, మొత్తం జనాభా 140.80 కోట్లకు చేరింది.

    అయితే, ఈ సంవత్సరంలో 9.54 మిలియన్ మంది పిల్లలు జన్మించినా, ఇది జనాభా పెరుగుదలపై ప్రభావం చూపలేకపోయింది.

    గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 5.2 లక్షల మంది అధికమైనా, 2023లో 20.8 లక్షల మంది జనాభా తగ్గడం కీలకాంశంగా నిలిచింది.

    అంతేకాకుండా, 2023లో జననాల రేటు తగ్గి 90.2 లక్షల మంది మాత్రమే జన్మించారు.

    కోవిడ్ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య పెరగడం కూడా జనాభా తగ్గుదలకు తోడ్పడిందని ప్రభుత్వం వెల్లడించింది.

    వివరాలు 

    యువత ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా

    చైనా ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో మానవ వనరులు ప్రధాన పాత్ర పోషించాయి.

    యువత ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. అయితే జనాభా తగ్గుదల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది.

    గతంలో జనాభా పెరుగుదలపై నియంత్రణ విధానాలను అనుసరించడం ఈ సమస్యకు దారితీసింది.

    ఈ సమస్యను ఎదుర్కొనేందుకు 2016లో ఒకే సంతానం విధానాన్ని రద్దు చేసింది. అదనంగా, జనాభా పెంపొందన కోసం నానాప్రయత్నాలు ప్రారంభించింది.

    ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, గృహాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు వంటి సదుపాయాలు కల్పించడం ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉంది.

    వివరాలు 

    వచ్చే 75 సంవత్సరాల్లో చైనా జనాభా 73 కోట్లకు పడిపోతుందని అంచనా 

    ఈ సమస్య చైనాకు మాత్రమే పరిమితం కాకుండా, భారతదేశం వంటి ఇతర దేశాల్లో కూడా కనిపిస్తోంది.

    ప్రపంచ వ్యాప్తంగా జనాభా క్షీణతపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

    జనాభా తగ్గుదల రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటిగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

    కొన్ని అంచనాల ప్రకారం, వచ్చే 75 సంవత్సరాల్లో చైనా జనాభా 73 కోట్లకు పడిపోతుందని భావిస్తున్నారు.

    ఇది ఆర్థిక శక్తిపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 2035 నాటికి చైనా జనాభా 1.36 బిలియన్లకు తగ్గవచ్చని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చైనా

    Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్
    India-China: ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ?  భారతదేశం
    India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు  లద్దాఖ్
    Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు  అంతరిక్షం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025