Page Loader
న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్' 
న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్'

న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్' 

వ్రాసిన వారు Stalin
Oct 14, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను గెల్చుకుంది. లేబర్‌కు చెందిన ప్రస్తుత ప్రధాన మంత్రి క్రిస్ హిప్‌కిన్స్ ఓటమిని అంగీకరించారు. ఈ సందర్భంగా నేషనల్ పార్టీ ప్రధాని అభ్యర్థి క్రిస్ లక్సన్‌కు ఫొన్ చేసి అభినందలు తెలిపారు. 42వ ప్రధానిగా లక్సన్ ఎన్నిక ఇక లాంఛనమే అని చెప్పాలి. అలాగే తమ కూటమిని గెలిపించిన న్యూజిలాండ్ ఓటర్లకు క్రిస్ లక్సన్‌ ధన్యవాదాలు తెలిపారు. శనివారం నాటికి 80% ఓట్లు లెక్కించబడ్డాయి. ప్రస్తుత ప్రధాని హిప్‌కిన్స్‌కి చెందిన లేబర్ పార్టీకి 25% ఓట్లు రాగా, లక్సన్ పార్టీకి ఇప్పటి వరకు దాదాపు 40శాతం ఓట్లను పొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్సన్ ఎన్నికల లాంఛనమే..