LOADING...
Russia: JF-17 ఇంజిన్ సరఫరాపై క్లారిటీ.. పాక్‌కు సహకారం ఇవ్వలేదన్న రష్యా 
JF-17 ఇంజిన్ సరఫరాపై క్లారిటీ.. పాక్‌కు సహకారం ఇవ్వలేదన్న రష్యా

Russia: JF-17 ఇంజిన్ సరఫరాపై క్లారిటీ.. పాక్‌కు సహకారం ఇవ్వలేదన్న రష్యా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో ఉపయోగించే JF-17 ఫైటర్ జెట్‌ల కోసం రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మాస్కో ఆ వార్తలను ఖండించింది. రష్యా ప్రభుత్వం, అటువంటి ఒప్పందాన్ని చేయలేదని స్పష్టం చేసింది. భారత్‌తో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో పాక్‌కు మద్దతు ఇచ్చే చర్యలను తాము చేపట్టడం సరికాదని రష్యా అధికారులు వెల్లడించారు. కాగా ఈ విషయం గురించి అక్కడి ప్రభుత్వంగా అధికారిక ప్రకటనలేదని గమనించవచ్చు. అంతర్జాతీయ మీడియా వర్గాల నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని JF-17 ఫైటర్ జెట్‌లలో ఉపయోగించే ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తున్నట్టు పలు వర్గాలు పేర్కొన్నాయి.

Details

బీజేపీపై విమర్శలు

ఈ నేపథ్యాన్ని ఉటంకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకారం, ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహిత వ్యాపార భాగస్వామిగా పేర్కొన్నప్పటికీ, ఆదేశం మన శత్రు దేశమైన పాక్‌కు మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. ఇది ఇతర దేశాలతో భారత సంబంధాలలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జైరాం రమేశ్ కేంద్రం జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఖ్యాతికి ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. రష్యా ఎందుకు పాక్‌కు మద్దతు ఇస్తోందో మోదీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుస్తున్నట్లు ప్రచారం చేసే మోదీ, పాక్‌ను ఒంటరి చేయడంలో ఇంకా విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు అన్నారు.