LOADING...
Nepal: నేపాల్‌లో మత ఘర్షణలు.. అప్రమత్తమైన భారత్‌, సరిహద్దు తాత్కాలికంగా మూసివేత
నేపాల్‌లో మత ఘర్షణలు.. అప్రమత్తమైన భారత్‌, సరిహద్దు తాత్కాలికంగా మూసివేత

Nepal: నేపాల్‌లో మత ఘర్షణలు.. అప్రమత్తమైన భారత్‌, సరిహద్దు తాత్కాలికంగా మూసివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాలయ దేశం నేపాల్‌లో ఆందోళనలు (Protests in Nepal) చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. నేపాల్‌తో సరిహద్దును (India Nepal Border) మూసేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా సీమాంతర కదలికలపై ఆంక్షలు విధించింది. ధనుశా జిల్లాలో ఓ ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ ఆందోళనలు చెలరేగాయి. పర్సా, రాహౌల్‌ తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. కొన్నిచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది.

Advertisement