Loading...
Cornell University: 'ఫ్రీ సెక్స్‌' అంటూ గ్రూపులో మెసేజ్‌.. కార్నెల్‌ యూనివర్సిటీపై దావా
'ఫ్రీ సెక్స్‌' అంటూ గ్రూపులో మెసేజ్‌.. కార్నెల్‌ యూనివర్సిటీపై దావా

Cornell University: 'ఫ్రీ సెక్స్‌' అంటూ గ్రూపులో మెసేజ్‌.. కార్నెల్‌ యూనివర్సిటీపై దావా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ప్రముఖ కార్నెల్‌ యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు తాజాగా కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు దర్యాప్తును పునఃప్రారంభించారు. గతంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

మత్తు పదార్థాలు ఇచ్చి.. లైంగిక దాడి

20 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో తనకు మత్తు పదార్థాలు ఇచ్చి, ఆ తర్వాత పలువురు వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.

ఈ ఘటనపై తాజాగా కార్నెల్‌ యూనివర్సిటీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాటర్నిటీకి చెందిన ఏడుగురు సభ్యులపై ఆమె సివిల్‌ దావా వేసింది.

2014లో కార్నెల్‌ యూనివర్సిటీలోని చి ఫై ఫ్రాటర్నిటీ హౌస్‌కు ఓ స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆమె దావాలో పేర్కొంది.

అప్పటికే తాను మత్తులో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కెటమైన్‌ తీసుకోవాలని బలవంతం చేశారని.. అనంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.

వివరాలు 

'ఫ్రీ సెక్స్‌' అంటూ గ్రూపులో మెసేజ్

తాను అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఫ్రాటర్నిటీకి చెందిన స్నాప్‌చాట్‌ గ్రూపులో ఓ వ్యక్తి 'ఫ్రీ సెక్స్‌' అంటూ సందేశం పంపినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.

ఆ సందేశానికి మరికొందరు అసభ్యంగా స్పందించారని.. అనంతరం మరింత మంది అక్కడికి చేరుకుని గంటల తరబడి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె దావాలో పేర్కొంది.

మూడు వారాల తర్వాత పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటన అనంతరం తాను తీవ్రంగా మానసికంగా కుంగిపోయానని బాధితురాలు తెలిపింది. పరిస్థితి నుంచి బయటపడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొంది.

స్నేహితుల సహకారంతో ఘటన జరిగిన మూడు వారాల తర్వాత యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది.

కార్నెల్‌ యూనివర్సిటీ ఈ ఘటనపై అంతర్గతంగా విచారణ చేపట్టిందని ఆమె తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

మిగిలిన వారికి వివిధ శిక్షలు

అయితే ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురిలో ఇద్దరిని మాత్రమే యూనివర్సిటీ నుంచి బహిష్కరించారని బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలి తరఫు న్యాయవాది థామస్‌ గియుఫ్రా మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన వ్యక్తులకు సస్పెన్షన్‌, వర్క్‌షాప్‌లకు హాజరు కావడం, వ్యాసాలు రాయడం వంటి వివిధ రకాల శిక్షలు విధించినట్లు దావాలో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఒక్కరినీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు.

ఈ ఘటన తర్వాత బాధితురాలు తన చదువును కూడా మధ్యలోనే నిలిపివేసినట్లు దావాలో వెల్లడించారు.

కార్నెల్‌ యూనివర్సిటీ, ఫ్రాటర్నిటీ సభ్యులపై ఒప్పంద ఉల్లంఘన, నిర్లక్ష్యం, రాష్ట్ర చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు చేస్తూ ఆమె పరిహారం కోరింది.

ADVERTISEMENT

వివరాలు 

'క్రిమినల్‌ కేసుకు ఆధారాలు సరిపోలేదు'

మరోవైపు టాంప్‌కిన్స్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం ఈ వ్యవహారంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తును సమీక్షించినట్లు తెలిపింది.

అయితే క్రిమినల్‌ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు అవసరమైన స్థాయిలో ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

కార్నెల్‌ యూనివర్సిటీ స్పందన ఏమిటంటే..

తమ నిబంధనలకు అనుగుణంగా అంతర్గత విచారణ నిర్వహించినట్లు కార్నెల్‌ యూనివర్సిటీ చెబుతోంది.

అయితే బాధితురాలి తరఫు న్యాయవాదులు మాత్రం యూనివర్సిటీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో క్రిమినల్‌ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు సరిపడా ఆధారాలు లభించలేదని టాంప్‌కిన్స్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది.

ప్రస్తుతం బాధితురాలు దాఖలు చేసిన సివిల్‌ దావాతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది.

కోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోపణలకు సంబంధించి తదుపరి పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT