Trump: 'మోదీ మంచి వ్యక్తే.. కానీ నేను సంతోషంగా లేను': భారత్‌పై మళ్లీ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను ఉద్దేశించి సుంకాల పెంపుపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారని ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తీసుకోబోయే తదుపరి చర్యలపై మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ''ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి. అయితే నేను సంతృప్తిగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా కీలకం.వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే...మేము చాలా వేగంగా సుంకాలను పెంచుతాం'' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన ఆడియో క్లిప్‌ను శ్వేతసౌధం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
వివరాలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ అమెరికాకు సహకరించకపోతే టారిఫ్‌లు పెంచుతామని ట్రంప్ హెచ్చరించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం తనతో జరిగిన సంభాషణలో ప్రధాని మోదీ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడంతో అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యాతో వ్యాపారం చేస్తే భారీ సుంకాలు? భారత్‌కు ట్రంప్ వార్నింగ్
#BREAKING | "We could raise tariffs on India if they don't help on Russian Oil issue;" says US President Trump#Trump #Venezuela #Russia #India pic.twitter.com/pDKlT3Cy5c
— ET NOW (@ETNOWlive) January 5, 2026