Nepal Floods: ఏ క్షణమైనా ఉప్పొంగొచ్చు.. నేపాల్‌కు చైనా వార్నింగ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 29, 2026
11:54 am
ఈ వార్తాకథనం ఏంటి
హిమానీనదం బద్దలై ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు సంభవించగా.. ఆ విపత్తు కారణంగా కొట్టుకొచ్చిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలు పేరుకుపోవడంతో టిబెట్ వైపున ఓ సరస్సు ఏర్పడింది. ప్రస్తుతం ఆ సరస్సు ఉప్పొంగే ప్రమాదం ఉందని చైనా మరోసారి హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా సరస్సు పొంగి నీరు దిగువ ప్రాంతాలకు దూసుకురావచ్చని చైనా అధికారులు హెచ్చరించారు. సరస్సులోని నీటి రంగు మారుతుండటమే ఇందుకు సంకేతమని తెలిపారు. ఈ సమాచారాన్ని చైనా అధికారులు నేపాల్ విదేశాంగశాఖతో పంచుకున్నారు.
వివరాలు
ఏ క్షణమైనా బద్దలయ్యే అవకాశం
''విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సు రంగు మారుతోంది.
ముదురు రంగులోకి వస్తోంది. అంటే అది బద్దలయ్యే అవకాశం ఉంది'' అని చైనా అధికారులు వెల్లడించారు.
సరస్సు బద్దలైతే మరోసారి భారీ వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ఇరు దేశాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు