LOADING...
Covid-19 : సింగపూర్‌ను వణికిస్తున్న కరోనా కేసులు.. వారంలో 59% కేసుల పెరుగుదల
సింగపూర్‌ను వణికిస్తున్న కరోనా కేసులు.. వారంలో 59% కేసుల పెరుగుదల

Covid-19 : సింగపూర్‌ను వణికిస్తున్న కరోనా కేసులు.. వారంలో 59% కేసుల పెరుగుదల

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

సింగపూర్‌లో మరోసారి కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 10 నుంచి 16 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 12,700 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఇది 58.8శాతం అధికంగా ఉండటం గమనార్హం.కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.గతంలో రోజుకు సగటున 56మంది ఆసుపత్రుల్లో చేరగా,ప్రస్తుతం ఆ సంఖ్య 73కు చేరింది. అయితే ఇప్పటివరకు కరోనా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని సింగపూర్ వైద్య అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఎన్‌బీ.1.8.1 కరోనా రూపాంతరంపై అందుబాటులో ఉన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం

Advertisement