సింగపూర్: వార్తలు

కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.

మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా 

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.

పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు

సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ జాతి వివక్షకు గురైంది. అయితే అది ఇప్పుడు కాదు. 2021లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.