Page Loader
సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం 
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 02, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతి థర్మన్‌ షణ్ముగరత్నం సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికిపైగా భారీ ఓట్లు సాధించారు. పోలైన 20,48,000ఓట్లలో మాజీ ఉపప్రధాని షణ్ముగరత్నం 17,46,427 ఓట్లు పొందారు. చెనా సంతతి ప్రత్యర్థి అభ్యర్థులు ఎన్జీ కాక్‌ సాంగ్‌, టాన్‌ కిన్‌ లియాన్‌లకు వరుసగా 15.72శాతం, 13.88శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో సింగపూర్‌కు భారత సంతతి మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. గతంలో రామనాథన్‌, దేవన్‌ నాయర్‌ అధ్యక్షులుగా కొనసాగారు. 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగరత్నం 2011-19 వరకు ఉపప్రధానిగా పనిచేశారు. ఎన్నికల్లో గెలిచిన షణ్ముగరత్నానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్- సింగపూర్ వ్యూహాత్మాక భాగస్వామాన్ని బలోపేతం చేసుకునేందుకు కలిసి పని చేద్దామని ఆకాంక్షించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ