Page Loader
Narendramodi: భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ  
భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ

Narendramodi: భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
07:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఓ స్ఫూర్తిదాయక నమూనా అని అభివర్ణించారు. ఆయన భారత్‌లో కూడా అనేక 'సింగపూర్‌'లను సృష్టించాలనుకుంటున్నట్లు చెప్పారు. సింగపూర్‌ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, సింగపూర్‌ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

యువ నాయకత్వం సింగపూర్‌కు మరింత పురోగతి తీసుకొస్తుందన్న ఆశాభావం: మోదీ

''భారతదేశంలో అనేక సింగపూర్‌లను సృష్టించాలన్నది మా లక్ష్యం. దీనిని సాధించడానికి మేము సంతోషంగా కలిసి పనిచేస్తున్నాం. మంత్రుల స్థాయిలో జరిగిన చర్చలు ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గనిర్దేశకంగా ఉంటాయి,'' అని మోదీ అన్నారు. అలాగే, లారెన్స్‌ వాంగ్‌ సింగపూర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సమావేశమయ్యామని మోదీ గుర్తు చేశారు. ఆయన యువ నాయకత్వం సింగపూర్‌కు మరింత పురోగతి తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, నైపుణ్య శిక్షణ, డిజిటలైజేషన్‌, తయారీ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారంపై చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు.