
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నం ఆ జాబితాలో చేరారు. ఏకంగా 70.4శాతంలో ఓట్లతో సింగపూర్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
2020నుంచి సింగపూర్ ప్రతిపక్ష నేతగా కూడా ప్రీతమ్ సింగ్ కూడా భారతీయ మూలాలున్న న్యాయవాది కావడం విశేషం.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవిపై కన్నేసిన విషయం తెలిసిందే.
Details
అమెరికా పార్లమెంట్ లో భారత సంతతికి చెందిన వారు
ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి కూడా భారతీయ మూలాలున్నా వారే. ఇక వివేకా రమస్వామి పోటీగా ఉన్న నిఖి హేలీ కూడా భారత సంతతకి చెందిన వారు కావడం గమనార్హం.
ముఖ్యంగా అమెరికా పార్లమెంటు లోనే చాలా మంది మనోళ్లే ఉన్నారు. రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్, అమీబెరా, తానేదార్ లు ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
ఇప్పుడు బ్రిటన్‌ను పాలిస్తున్న రుషి సునాక్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌ను పాలిస్తున్న తొలి భారత సంతతి రాజకీయ నాయకుడు రుషి.
2015 నుంచీ పోర్చుగల్ ప్రధానిగా కొనసాగుతున్న ఆంటోనియో కోస్టాకు భారత్, పోర్చుగీసు మూలాలున్నాయి.