Page Loader
కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం
కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది. ఉరిశిక్ష అమలును పునరాలోచించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయంతో పాటు అంతర్జాతీయ సంస్థలు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. తంగరాజు సుప్పయ్యకు చెందిన రెండు మొబైల్ ఫోన్ నంబర్లు మాదకద్రవ్యాల పంపిణీ కోసం ఉపయోగించినట్లు విచారణలో తేలినట్లు సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది.

డ్రగ్స్ 

సింగపూర్‌లో అత్యంత కఠినమైన డ్రగ్ వ్యతిరేక చట్టాలు 

సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్ వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరణశిక్ష సమర్థవంతమైన నిరోధకంగా పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం(ఓహెచ్‌సీహెచ్ఆర్) సింగపూర్ ప్రభుత్వ వాదనను ఖండించింది. మరణశిక్షను ఇప్పటికీ తక్కువ దేశాల్లో అమలు చేస్తున్నారు. మరణశిక్ష నేరాలను అరికడుతుందనే అపోహ మాత్రమే అని ఓహెచ్‌సీహెచ్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. సింగపూర్ పొరుగు దేశం థాయ్‌లాండ్ డ్రగ్స్ స్మగ్లింగ్‌ కేసుల్లో ఇప్పటికే ఉరిశిక్షను రద్దు చేసింది. సింగపూర్ కూడా రద్దు చేయాలని ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది.