
Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఏర్పడింది.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత కోసం ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు.
తాజా సమాచారం మేరకు, మార్క్ శంకర్‌కు పెద్దగా ప్రమాదం జరగలేదు. అతనికి స్వల్ప గాయాలు మాత్రమే కాగా, ప్రధానంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిన కారణంగా కొంతకాలం అనారోగ్యానికి గురయ్యాడు.
ప్రమాదం అనంతరం ఆయన్ని అత్యవసర చికిత్స విభాగంలో ఉంచిన వైద్యులు, పరిస్థితి మెరుగుపడుతుండటంతో ప్రస్తుతం సాధారణ గదికి మార్చారు. మరికొన్ని రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Details
సింగపూర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్
ఈ ఘటనను తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని తక్షణమే సింగపూర్‌కు వెళ్లారు.
ఆసుపత్రిలో కుమారుడిని పరామర్శించిన తర్వాత వైద్యులతో సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
సమాచారం మేరకు మార్క్ శంకర్‌కు చేతులు, కళ్ల ప్రాంతాల్లో స్వల్ప గాయాలు మాత్రమే సంభవించినట్లు వైద్యులు తెలిపారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవికీ వైద్యులు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇంతలోనే ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ తాజా ఫోటో విడుదలైంది.
Details
త్వరగా కోలుకోవాలని పూజలు
ఈ చిత్రంలో అతను క్షేమంగా ఉన్నట్లు స్పష్టమవడంతో అభిమానులు కొంత ఊరటకు గురయ్యారు.
ఫోటోలో ఆయన ఆరోగ్యంగా కనిపించడంతో సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. ఈ వార్త తెలిసిన వెంటనే పలు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నారి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్‌లు షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్.కే. రోజా తదితరులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చిన్నారి భద్రతకై ప్రార్థిస్తున్నామని తెలిపారు.