తదుపరి వార్తా కథనం

Worlds Most Expensive Cities 2023 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే.. అగ్రస్థానంలో సింగపూర్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 30, 2023
01:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
Economist Intelligence Unit (EIU) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ప్రకటించింది.
2023లో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్(Singapore) , జ్యూరిచ్‌లు నిలిచాయి.
200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల సగటు ధరలు స్థానిక కరెన్సీ పరంగా సంవత్సరానికి 7.4శాతం పెరగడం విశేషం.
రవాణా, దుస్తులు, కిరాణా సామాగ్రి, ఆల్కహాల్‌తో సహా వివిధ వర్గాలలో అధిక ధరల స్థాయిలు ఆధారంగా సింగపూర్ పదకొండు సంవత్సరాలలో తొమ్మిదవసారి అగ్రస్థానాన్ని పొందింది.
Details
ఇండియాకు లభించిన చోటు
హాంకాంగ్ ఐదవ స్థానంలో, లాస్ ఏంజిల్స్ ఆరవ స్థానంలో నిలిచాయి. పారిస్, కోపెన్‌హాగన్, శాన్ ఫ్రాన్సిస్కో, టెల్ అవీవ్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
2023 సర్వే ప్రపంచవ్యాప్తంగా 173 ప్రధాన నగరాలను కవర్ చేస్తుంది.
అత్యంత ఖరీదైన టాప్ 10 ప్రాంతాల జాబితాలో ఇండియాకు చోటు లభించకపోవడం గమనార్హం.