Vistara Airlines: పైలట్ల కొరత: విమాన సర్వీసులను తగ్గించుకున్నవిస్టారా
ఈ వార్తాకథనం ఏంటి
విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన చేసింది.
పైలట్ల కొరత, తగినంత విమాన సిబ్బంది లేని కారణంగా 10 శాతం మేర విమాన సర్వీసులను తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది.
ప్రతి రోజు 25 నుంచి 30 విమాన సర్వీసులను తగ్గించుకుంటున్నట్లు తెలిపింది.
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్, సంయుక్తంగా వేసవిలో ప్రతిరోజు 300 విమాన సర్వీసులకు పైగా నడిపేందుకు నిర్ణయించాయి.
అయితే పైలట్లు సవరించిన జీతాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడంతో విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనం కావడం వంటి కారణాలతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Flights canceled
మే చివరినాటికల్లా పరిస్థితి కుదుట పడుతుంది: విస్తారా సీఈఓ
ప్రతిరోజు 25 నుంచి 30 విమానాలను నడిపేందుకు కృషి చేస్తున్నాం.
2024 ఫిబ్రవరిలో అందించిన విధంగానే విమాన సర్వీసులను తిరిగి సమీప భవిష్యత్తులో ప్రారంభిస్తామని విస్తారా తన ప్రకటనలో పేర్కొంది.
విమాన సర్వీసుల రద్దు లేదా తగ్గింపు కేవలం దేశీయ విమాన సర్వీసుల మీద మాత్రమే ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు క్షమాపణలు కోరింది.
విస్తారా నుంచి ముందస్తు ప్రయాణాలను బుక్ చేసుకున్న విమాన సర్వీసుల రద్దు వల్ల వారికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లు సంస్థ వెల్లడించింది.
మే చివరి నాటికి మళ్లీ పైలట్లు కొత్త కాంట్రాక్టు ఒప్పందంపై సంతకాలు చేస్తారని త్వరలోనే వారంతా తిరిగి విధుల్లోకి చేరతారని విస్తారా సీఈఓ వినో కన్నన్ తెలిపారు.