Page Loader
Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ
Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ

Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ

వ్రాసిన వారు Stalin
May 20, 2024
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ మర్చంట్ కామర్స్ స్టార్టప్, పైన్ ల్యాబ్స్, దాని మాతృక సంస్థను భారతీయ యూనిట్‌తో విలీనానికి ఆమోదం పొందింది. ఈ మేరకు సింగపూర్ కోర్టు పచ్చ జెండా ఊపింది.ఈ నిర్ణయం వల్ల కంపెనీ తన అన్ని ఆస్తులను యధాతధంగా బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది. దాంతో పాటు తన కార్యకలాపాలను సమర్థవంతంగా భారతీయ మార్కెట్‌కు బదిలీ చేయడానికి వెసులు బాటు కల్పిస్తుంది. భారతీయ మార్కెట్‌ ను టెక్ క్రంచ్ కొంత కాలంగా పరిశీలిస్తుంది. టెక్ క్రంచ్ తన పరిశీలనలో కోర్టు ఆదేశాలిచ్చినట్లు నిర్ధారించింది. పైన్ ల్యాబ్స్ ఉత్పత్తులు, సేవలు అధిక స్ధాయిలో వ్యాపారం చేస్తుంది. పైన్ ల్యాబ్స్ క్లౌడ్-కనెక్ట్ చేయబడిన పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్‌లు సరఫరా చేస్తుంది.

Details 

 భారత్ వైపు మేజర్ స్టార్ట్-అప్‌లు అడుగులు 

దీంతో పాటుగా వర్కింగ్ క్యాపిటల్‌తో సహా వ్యాపారులకు అనేక రకాల వస్తువులు సేవలను అందిస్తుంది. కంపెనీకి పీక్ XV, ఫిడిలిటీ, పేపాల్, ఇన్వెస్కో, టెమాసెక్ ఆల్ఫా వేవ్ క్లయింట్ లుగా ఉన్నారు. ప్రస్తుతం $5 బిలియన్లకు పైగా విలువ కలిగిన పైన్ ల్యాబ్స్, భారతీయ స్టార్ట్-అప్‌లు తమ కార్యకలాపాలను భారతదేశానికి విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పైన్ ల్యాబ్స్ తో సహా ఇతర స్టార్టప్‌లు ఫ్లిప్‌కార్ట్, రేజర్‌పే, మీషో, జెప్టో ఉడాన్‌లు భారతదేశానికి రానున్నాయి.అవి ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

Details 

అదే బాటలో మరికొన్ని స్టార్టప్‌లు 

ఫిన్‌టెక్ స్టార్టప్‌లు PhonePe ,Groww ఇప్పటికే తమ విదేశీ హోల్డింగ్ ఆస్తులను భారతదేశానికి బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేశాయి. అభివృద్ధి చెందిన మార్కెట్లలో సంస్థాగత పెట్టుబడిదారుల నుండి పరిమిత డిమాండ్ వల్ల , $20 బిలియన్ల కంటే తక్కువ విలువైన స్టార్టప్‌ల కోసం కంపెనీలు తరలిపోతున్నాయని పేరు చెప్పని పెట్టుబడిదారు వ్యాఖ్యానించాడు.