Raghuram Rajan: భారతీయ యువత మనస్తత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారతీయ యువత మనస్తత్వంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) మాజీ గవర్నర్ (Governer)రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత యువత (Youth) భారత్ (India) లో స్థిరపడేందుకు ఇష్టపడటం లేదన్నారు. వారంతా ప్రపంచవ్యాప్తంగా వారి బిజినెస్ ను పెంచుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ఇండియా లో వారు సంతోషంగా ఉండలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మనస్తత్వంలాగా మార్కెట్ (Market)లో తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలకో లేక ప్రాంతాలకో వెళ్లేందుకే భారతీయ యువత నేడు మొగ్గు చూపుతుందన్నారు. భారత యువత సింగపూర్ (Singapore) లేదా సిలికాన్ వ్యాలీ (Siliconvalley) కో ఎందుకు వలస వెళ్లిపోతున్నారని వాషింగ్టన్ లోని విలేకరులు అడిగిన ప్రశ్నకు రఘురాం రాజన్ సమాధానమిచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరించాలనుకుంటున్నారు
ప్రపంచవ్యాప్తంగా యువత తమ వ్యాపారాలను విస్తరించాలనుకుంటున్నారని , వారికి ఇండియాలో ఉండటం సంతోషంగా లేదని చెప్పారు. విరాట్ కోహ్లీ లా వారు ఎవరికీ భయపడే మనస్తత్వం కాదన్నారు. అందుకే దేశాలు దాటి వెళ్లి మరీ విజయవంతమవ్వాలనుకుంటున్నారని చెప్పారు. మానవ పెట్టుబడి, వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన అవసరముందని సూచించారు.