తదుపరి వార్తా కథనం

Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర గందరగోళం.. ఒకరు మృతి, 30 మందికి గాయలు
వ్రాసిన వారు
Stalin
May 21, 2024
05:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణం అనుకూలించకపోవడంతో లండన్ నుంచి వస్తున్న సింగపూర్ విమానం బ్యాంకాక్ లో ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ అయింది.
777-300ER బోయింగ్ విమానంలో మొత్తం 211 మంది ప్రయాణిస్తున్నారు. విమానం ఒక్కసారిగా కుదుపులకు గురి అయింది.
కుదుపులతో కలవరపాటుకి గురైన ఓ ప్రయాణీకుడు చనిపోయారు. ఈ విమానంలో ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు.
విమానం ల్యాండ్ కాగానే ధాయ్ లాండ్ వైద్య సిబ్బంది లోపలికి ప్రవేశించి గాయపడిన వారికి చికిత్స చేశారు.
మృతి చెందిన వ్యక్తి వివరాలు వెల్లడించలేదు. దాదాపుగా 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. దీనిని బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులు ధృవీకరించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సింగపూర్ విమానం బ్యాంకాక్ లో అత్యవసరంగా ల్యాండింగ్
1 dead in severe turbulence on Singapore Airlines flight, 30 reportedly injured - India Today https://t.co/dscgyO5eWT
— iVyasa (@ivyasaa) May 21, 2024