Page Loader
ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో 
జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో 

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్‌ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇటీవల ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగించిన నేపథ్యంలో కొన్ని వారాలుగా బీజీబిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్నా కూడా సింగపూర్‌కు ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, పీఎస్ఎల్‌వీ సాయంతో ఏప్రిల్‌లో రెండు ఉప గ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. గత నెలల్లో సాధించిన ఈ విజయాలు అంతరిక్ష రంగంలో ఇస్రో పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఉపగ్రహం

వాతావరణ రిపోర్టును అందించనున్న డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం

దాదాపు 360 కిలోల బరువున్న డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని 535 కిలోమీటర్ల ఎత్తులోని నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ (ఎన్ఈఓ)లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది. ఇందుకోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ56ను ఇస్రో కొనుగోలు చేసింది. డీఎస్-ఎస్ఏఆర్ ఉప గ్రహాన్ని సింగపూర్ ప్రభుత్వానికి చెందిన డీఎస్‌టీఏ, ఎస్‌టీ ఇంజనీరింగ్ (సింగపూర్ టెక్నాలజీ ఇంజనీరింగ్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. డీఎస్-ఎస్ఏఆర్ అనే ఉపగ్రహం వాతావరణ మార్పులను అందించడంలో సింగపూర్ ప్రభుత్వానికి ఉపయోగపడనుంది. ఏ వాతావరణంలోనైనా రౌండ్-ది-క్లాక్ పని చేసే విధంగా దీన్ని రూపొందించారు. జులై 30 ఉదయం 6:30 గంటలకు ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్