
సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.
గురువారం నుండి ఇంటి నుండి పని చేయమని ఈ కార్యాలయ సిబ్బందిని ఆదేశించింది. అయితే మస్క్ రిమోట్ పని విధానానికి వ్యతిరేకి కానీ ఇప్పుడు ఈ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమనడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
బుధవారం సింగపూర్ కార్యాలయంలోని సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో, డెస్క్‌లను క్లియర్ ఖాళీ చేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. సింగపూర్ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుందా లేదా అనేది ఇంకా తెలియలేదు.
ట్విట్టర్
అద్దె చెల్లించకపోవడంతో ట్విట్టర్ సింగపూర్ కార్యాలయం మూసివేత
అద్దె చెల్లించకపోవడంతో ట్విట్టర్ సింగపూర్ కార్యాలయం మూసివేస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదికలపై స్పందించిన CapitaGreen యజమాని CapitaLand, ట్విట్టర్ సంస్థ నుండి అటువంటి ఇబ్బంది ఏమి లేదని తెలిపింది.
ఈ సింగపూర్ కార్యాలయం కంపెనీ ఖర్చు తగ్గింపులో భాగంగా ఇటీవల ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సైట్ అధిపతి నూర్ అజర్ బిన్ అయోబ్‌ను తొలగించింది. తప్పుడు సమాచారం, గ్లోబల్ అప్పీల్స్, స్టేట్ మీడియాకు సంబంధించిన విధానాలపై పనిచేసే బృందాలలో ఉద్యోగులను కూడా తొలగించింది. ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ అనేక మంది ఉద్యోగులను ఈ కార్యాలయం నుండి తొలగించినట్లు ధృవీకరించారు.
ఇటువంటి ఖర్చు తగ్గింపు చర్యలే కాకుండా సరికొత్త ఆదాయ మార్గాలను వెతకడంలో ట్విట్టర్ నిమగ్నమైంది.