ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో యూజర్ నేమ్స్ ను విక్రయించాలని ఆలోచిస్తుంది. హ్యాకర్లు కావాల్సిన యూజర్‌నేమ్‌లను అమ్మకానికి పెట్టడం తెలిసిందే. అయితే, ఒక సోషల్ మీడియా కంపెనీ యూజర్ నేమ్స్ ను విక్రయించడం అనేది జరగడం తక్కువ. అయితే ఇదేం కొత్త ఆలోచన కాదు, గత సంవత్సరం టెలిగ్రామ్ వ్యక్తిగత ఖాతాలు, ఛానెల్‌ల కోసం యూజర్ నేమ్స్ కోసం వేలం వేయాలని నిర్ణయించుకుంది. ట్విట్టర్‌లోని ఇంజనీర్లు యూజర్‌నేమ్‌లను వేలం వేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. అటువంటి వేలంలో, ప్రజలు ఆ పేర్ల కోసం వేలంలో పాల్గొనవచ్చు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఆలోచన ఉంది.
ప్రస్తుత ట్విట్టర్ పాలసీ ఈ మార్గానికి వ్యతిరేకంగా ఉంది
ఆదాయ మార్గంగా యూజర్‌నేమ్‌ల అమ్మడం గురించి సందేహం అవసరంలేదు. అత్యంత విలువైన టెలిగ్రామ్ యూజర్ నేమ్ (@న్యూస్) $2.42 మిలియన్లకు అమ్ముడుపోయింది. అయినప్పటికీ, అన్ని యూజర్ నేమ్స్ పెద్ద అంతర్గత విలువ ఉండవు. కానీ బ్లాక్ మార్కెట్ విక్రయాల వంటి వాటి వల్ల ఎప్పుడూ మంచి ఆదాయం రావచ్చు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ విధానం యూజర్ నేమ్స్ కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వ్యతిరేకం. వేదిక ద్వారా యూజర్ నేమ్స్ అమ్మకం నిషేధించబడింది. యూజర్ నేమ్స్ బదులుగా ఇతర రకాల చెల్లింపులను విక్రయించడం, కొనుగోలు చేయడం వంటివి కూడా ఉల్లంఘనలే అటువంటప్పుడు ఖాతా శాశ్వత సస్పెన్షన్‌కు దారి తీయవచ్చని ట్విట్టర్ పాలసీలో ఉంది. ఇప్పుడు ఈ కొత్త ఆలోచన రూపుదిద్దుకోవడానికి పాలసీని మార్చాల్సి రావచ్చు.