ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్
ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్‌లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్‌లు, ట్రెండ్‌లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు. హోమ్, తాజా ట్వీట్‌ల మధ్య మారడానికి వినియోగదారులకు కుడివైపు ఎగువున ఉన్న స్టార్ సింబల్ నొక్కాలని చెప్పారు. ఒక వినియోగదారునికి ప్రత్యుత్తరం ఇస్తూ, "ముందుకు వెనుకకు మారడం మంచిది. మేము ట్విట్టర్ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని మెరుగుపరుస్తున్నప్పుడు, కావాల్సిన ట్వీట్‌లు, అంశాలు వినియోగదారులకి కనిపిస్తాయి" అని ఎలోన్ మస్క్ అన్నారు.
ఎలోన్ మస్క్ ఈ కొత్త ఫీచర్ గురించి చేసిన ట్వీట్
ట్విట్టర్ లో ఫోన్ రకాన్ని చూపించే ట్యాగ్ తొలగింపు
ప్రస్తుతానికి, ట్వీట్‌లను టైమ్‌లైన్, హోమ్ మధ్య మారడానికి యాప్ కుడివైపు ఎగువన ఉన్న స్టార్ సింబల్ పై నొక్కడానికి ట్విట్టర్ లో ఆప్షన్ ఉంది. ఇటీవల, ట్విట్టర్ ట్వీట్ చేయడానికి ఉపయోగించే ఫోన్ రకాన్ని చూపించే ట్యాగ్‌ను తీసివేసింది. వినియోగదారులు ఇంతకు ముందు త్వేట్ చేసినప్పుడు "ఐఫోన్ నుండి ట్విట్టర్" లేదా "ఆండ్రాయిడ్ నుండి ట్విట్టర్" అని చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ తీసేసారు. అదనంగా, ట్విట్టర్ ట్వీట్ వీక్షణలను చూసే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ వినియోగదారులు ఇప్పుడు ఏ ట్వీట్‌లో వీక్షణల సంఖ్యను చూడగలరు. వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఇటువంటి మరిన్ని ఆప్షన్స్ ట్విట్టర్ లో ఈ సంవత్సరంలో రావాలని ట్విట్టర్ ప్రేమికులు కోరుకుంటున్నారు.