Church Father Dies: చర్చిలో ప్రసంగిస్తుండగా విషాదం.. తలపై శిలువ పడి ఫాదర్ మృతి.. వీడియో వైరల్ ..
ఈ వార్తాకథనం ఏంటి
ఈక్వెడార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీవితానికి మరణం అనివార్యమని చర్చికి వచ్చిన విశ్వాసులకు సందేశం ఇచ్చిన కొద్దిసేపటికే ఓ కాథలిక్ ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. చర్చి వెనుక గోడ పైభాగంలో అమర్చిన భారీ ఏసుక్రీస్తు శిలువ ఒక్కసారిగా ఊడిపడి ఆయన తలపై బలంగా పడింది. దీంతో ఫాదర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో చర్చిలో ఉన్న భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దుర్ఘటన అక్టోబర్ 17న ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చిలో చోటుచేసుకుంది. ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విశ్వాసులకు సందేశం ఇస్తున్నారు.
వివరాలు
దేవుడికి,కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తగిన సమయం కేటాయించాలి
ఆ సమయంలో ఆయన వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ అకస్మాత్తుగా ఊడిపోయి తల వెనుక భాగంలో బలంగా తాకింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ఫాదర్ జీవితంలోని అనిశ్చితి, మరణం గురించి మాట్లాడారు.
మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా దేవుడికి, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తగిన సమయం కేటాయించాలని సూచించారు.
మానవ జీవితం శాశ్వతం కాదని, ఇతర విషయాల కంటే దేవుడితో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు.
అయితే, ఇలా మరణం గురించి వివరిస్తూ సందేశం ఇస్తున్న సమయంలోనే ఆయన ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాలు
ఫాదర్ మృతిపై గ్వాయాకిల్ ఆర్చ్‌డియోసిస్ తీవ్ర విచారం
ఫాదర్‌పై శిలువ పడిన వెంటనే చర్చిలో ఉన్న భక్తులు భయాందోళనలతో కేకలు వేస్తూ ఆయన వద్దకు పరుగెత్తారు.
వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఫాదర్ మృతిపై గ్వాయాకిల్ ఆర్చ్‌డియోసిస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
కాగా, భారీ శిలువ గోడ నుంచి అకస్మాత్తుగా ఎందుకు ఊడిపోయిందనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రార్థనల వేళ ఫాదర్‌పై పడిన భారీ శిలువ
A priest was killed in Ecuador after a massive cross collapsed on him during services.
— Open Source Intel (@Osint613) October 18, 2026
The incident happened in front of worshippers and was captured on a livestream. pic.twitter.com/0ia3NKTsjG