Wildfire in France: ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం.. అణుకేంద్రాల దిశగా విస్తరిస్తున్న మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు రోజురోజుకూ ఉధృతమవుతూ దేశంలోని అత్యంత కీలక రక్షణ, అణు కేంద్రాల దిశగా విస్తరిస్తోంది. నైరుతి ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ అగ్నికీలలు ప్రస్తుతం అణు కేంద్రాలు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ యూనిట్ల వైపు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ మంటలు ఫ్రాన్స్ అణ్వాయుధ వ్యవస్థకు చెందిన క్షిపణి కేంద్రాలు, కీలక రక్షణ, ఏరోస్పేస్ సౌకర్యాలకు సుమారు 12 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్నాయి. దీంతో జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణుల తయారీ కేంద్రాలతో పాటు ఇతర వ్యూహాత్మక స్థావరాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది.
వివరాలు
అగ్నికి ఆహుతైన 420చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం
వందల సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దింపింది.
అగ్ని మరింత వ్యాపించకుండా ఉండేందుకు కీలక కేంద్రాల పరిసరాల్లోని చెట్లను భారీ బుల్డోజర్లతో తొలగిస్తూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో 420చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది.
పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అగ్నిప్రమాదం వల్ల భారీ స్థాయిలో ఆస్తినష్టం కూడా సంభవించింది.ఇదిలా ఉండగా,ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ అడవి మంటలు నవంబర్ తొలి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ అధికారులు హెచ్చరించారు.
దీంతో ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నారు.